LAWCET: ఏప్రిల్ 27 లాసెట్ దరఖాస్తుకు ఆఖరి తేది..! 8 d ago

ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్ ప్రవేశ పరీక్షను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. రాష్ట్రస్ధాయిలో ఈ ప్రవేశ పరీక్ష స్కోరుతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్దల్లో ఎల్ఎల్‌బీలో చేరవచ్చు. ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులకు ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీలు 42, ఎస్సీ, ఎస్టీలైతే 40 శాతం ఉంటే సరిపోతుంది. ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ. 800, బీసీలకు రూ. 850, ఓసీకీ రూ. 900. ప్రవేశ పరీక్షను జూన్ 5వ తేదీన నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 27 లోపు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.